News May 24, 2024

పుణే యాక్సిడెంట్.. డబ్బిచ్చి డ్రైవర్‌ను ఇరికించారా?

image

పుణేలో ఓ బాలుడు(17) మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తమ డ్రైవర్‌కు డబ్బు ఆఫర్ చేసి, కేసు తనపై వేసుకోవాలని బలవంతం చేశారట. అందుకే డ్రైవర్ తానే కారు నడిపానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు విశాల్‌పై పోలీసులు సెక్షన్ 201 కింద కేసు నమోదు చేయనున్నారు.

Similar News

News February 6, 2026

ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజాసాబ్’

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. గత నెల 9న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

News February 6, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 6, 2026

అంకెల్లో WPL-2026

image

✥ అత్యధిక పరుగులు- 377, స్మృతి (RCB-ఆరెంజ్ క్యాప్)
✥ ఫోర్లు-57, స్మృతి(RCB)
✥ సిక్సర్లు-13, హర్మన్‌ప్రీత్ కౌర్(MI)
✥ సెంచరీలు-1, స్కివర్ బ్రంట్(MI)
✥ అర్ధసెంచరీలు- 3: స్మృతి, హర్మన్‌ప్రీత్
✥ వికెట్లు-17, సోఫి డివైన్(గుజరాత్ జెయింట్స్-పర్పుల్ క్యాప్), నందిని శర్మ(DC)
✥ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన- 5-23vsGG, శ్రేయాంక పాటిల్(RCB)