News May 24, 2024

పుణే యాక్సిడెంట్.. డబ్బిచ్చి డ్రైవర్‌ను ఇరికించారా?

image

పుణేలో ఓ బాలుడు(17) మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తమ డ్రైవర్‌కు డబ్బు ఆఫర్ చేసి, కేసు తనపై వేసుకోవాలని బలవంతం చేశారట. అందుకే డ్రైవర్ తానే కారు నడిపానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు విశాల్‌పై పోలీసులు సెక్షన్ 201 కింద కేసు నమోదు చేయనున్నారు.

Similar News

News February 13, 2025

రాష్ట్రపతి పాలనతో సంభవించే మార్పులివే

image

✒ రాష్ట్ర ప్రభుత్వం/మంత్రి మండలి రద్దవుతుంది.
✒ ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు ఉండవు.
✒ ప్రెసిడెంట్ ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటారు.
✒ పాలనలో గవర్నర్‌కు సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తుంది.
✒ రాష్ట్రానికి అవసరమైన బిల్లులను పార్లమెంట్ రూపొందిస్తుంది. ✒ అత్యవసర సమయాల్లో పాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీ చేస్తారు.

News February 13, 2025

రేపు బంద్.. స్కూళ్లకు సెలవు ఉందా?

image

రేపు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్‌కు మద్దతివ్వడంపై విద్యార్థి సంఘాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంపై నిర్ణయం ప్రకటించనున్నాయి. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

News February 13, 2025

అమెరికా నుంచి మరో వలసదారుల విమానం?

image

అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారితో కూడిన రెండో విమానం ఈ నెల 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న 104మంది వలసదారుల్ని US అమృత్‌సర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 487మంది అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావాలనే పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుని విమానాల్ని తమ వద్ద దించుతోందని ఆ రాష్ట్ర మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు.

error: Content is protected !!