News May 24, 2024
జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

TG: వచ్చే నెల 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 12,186మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News October 22, 2025
RMLIMSలో 422 నర్సింగ్ పోస్టులు

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (RMLIMS) 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో దరఖాస్తు లింక్ ఓపెన్ కానుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drrmlims.ac.in/
News October 22, 2025
నిందితుడికి మా పార్టీలో ఏ పదవీ లేదు: TDP

AP: కాకినాడ(D) తునిలో స్కూల్ నుంచి బాలికను తోటలోకి తీసుకెళ్లిన <<18071366>>ఘటనపై<<>> టీడీపీ స్పందించింది. ‘సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలోనూ నిందితుడికి ఏ పదవీ లేదు. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు’ అని ట్వీట్ చేసింది.
News October 22, 2025
మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయండి: ప్రద్యుమ్న

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మాగంటి సునీతపై సంచలన ఆరోపణలు వచ్చాయి. తాను మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కొడుకును అని తారక్ ప్రద్యుమ్న అనే వ్యక్తి బయటికొచ్చారు. తన తల్లికి విడాకులు ఇవ్వకుండా సునీతతో ఆయన లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నారు. ఆమె నామినేషన్ రద్దు చేయాలని ECకి ఫిర్యాదు చేశారు. చట్టబద్ధంగా గోపీనాథ్‌కు తానే ఏకైక కుమారుడిని అని చెప్పారు. దీనిపై సునీత స్పందించాల్సి ఉంది.