News May 25, 2024

చాహల్ చెత్త రికార్డు

image

ఐపీఎల్ చరిత్రలో అత్యధికులు సిక్సులు సమర్పించుకుని.. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డుని మూటగట్టుకున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచులో ఆయన రెండు సిక్సులిచ్చారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆయన 224 సిక్సులు ఇచ్చి.. మాజీ స్పిన్నర్ పీయూష్(224) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. కాగా క్వాలిఫైయర్-2 మ్యాచులో చాహల్ నిరాశపర్చారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నారు.

Similar News

News June 26, 2024

AUSపై భారత్‌ విజయం.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు

image

ఆస్ట్రేలియాతో సూపర్-8 మ్యాచ్‌లో భారత్ బాల్ ట్యాంపరింగ్ చేసి గెలిచిందని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోపణలు చేశారు. కొత్త బంతిని అర్ష్‌దీప్ 16వ ఓవర్‌లో ఎలా రివర్స్ స్వింగ్ చేయగలిగారని, అంటే బంతి 12 లేదా 13వ ఓవర్లోనే రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మారిందా? అని ప్రశ్నించారు. అంపైర్లు కళ్లు తెరిచి ఉండాలని సూచించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 205 రన్స్ చేయగా ఛేదనలో ఆస్ట్రేలియా 181 పరుగులకే పరిమితమై ఓడింది.

News June 26, 2024

ఇది కదా సక్సెస్ అంటే!

image

రాజస్థాన్‌లోని దళిత కుటుంబానికి చెందిన మహిళ రాజకీయాల్లోకి రావడమే గ్రేట్. అలాంటిది 26 ఏళ్ల సంజనా జాటవ్ MPగా గెలిచి ఫ్యామిలీతో పార్లమెంట్‌కు వచ్చారు. తల్లి, అత్తామామల ఆశీర్వాదం తీసుకొని భరత్‌పూర్ MPగా ప్రమాణం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు అత్తామామలను ఒప్పించానని, MLAగా ఓడిపోయినా కాంగ్రెస్ తనను నమ్మి లోక్‌సభ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె కుటుంబం ఫొటో వైరలవుతోంది.

News June 26, 2024

జక్కన్న దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం

image

రాజమౌళి దంపతులు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళి, కాస్ట్యూమ్ కేటగిరీలో రమా రాజమౌళి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. ఇందులో షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ మరికొందరు సినీ ప్రముఖులు భారత్ నుంచి ఉన్నారు. గతేడాది రామ్‌చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ ఈ అకాడమీలో సభ్యత్వం సంపాదించారు.