News May 25, 2024

చాహల్ చెత్త రికార్డు

image

ఐపీఎల్ చరిత్రలో అత్యధికులు సిక్సులు సమర్పించుకుని.. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డుని మూటగట్టుకున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచులో ఆయన రెండు సిక్సులిచ్చారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆయన 224 సిక్సులు ఇచ్చి.. మాజీ స్పిన్నర్ పీయూష్(224) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. కాగా క్వాలిఫైయర్-2 మ్యాచులో చాహల్ నిరాశపర్చారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నారు.

Similar News

News June 17, 2024

హజ్ యాత్రలో 19 మంది యాత్రికులు మృతి

image

ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో ఎండ వేడికి తాళలేక 19 మంది యాత్రికులు మరణించారు. వీరంతా జోర్డాన్, ఇరాన్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. అధికారులు ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేసినా మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఎండలకు తాళలేక 240 మంది మరణించారు. కాగా ఎల్లుండితో హజ్ యాత్ర ముగియనుంది.

News June 17, 2024

రేపు అకౌంట్లోకి డబ్బులు

image

పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోదీ బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో.. రూ.2వేలు చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ సంతకం చేశారు.

News June 17, 2024

రికార్డు సృష్టించిన బాబర్ ఆజమ్

image

T20 వరల్డ్‌కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ నిలిచారు. 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన 549 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ(529-భారత్), విలియమ్సన్(527-న్యూజిలాండ్), జయవర్దనె(360-శ్రీలంక), గ్రేమ్ స్మిత్(352-దక్షిణాఫ్రికా) ఉన్నారు.