News May 25, 2024
కొన్ని గంటల్లో తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్(రెమాల్)గా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. రేపు ఉదయం ఇది తీవ్ర తుఫాన్‌గా మారి అర్ధరాత్రికి బెంగాల్ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఫలితంగా బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
Similar News
News September 16, 2025
మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 16, 2025
క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.
News September 16, 2025
బందీలను వదిలేయండి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

హమాస్ నాయకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు బందీలను మానవ కవచాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. హమాస్ నేతలు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతోందా? ఇది మహా దారుణం. అతి తక్కువ మంది అలాంటివి చూసుంటారు. అలా జరగకుండా ఆపండి. లేదంటే అన్నీ ఒప్పందాలు రద్దవుతాయి. బందీలను వెంటనే విడుదల చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు.