News May 25, 2024
కొన్ని గంటల్లో తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్(రెమాల్)గా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. రేపు ఉదయం ఇది తీవ్ర తుఫాన్‌గా మారి అర్ధరాత్రికి బెంగాల్ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఫలితంగా బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
Similar News
News February 18, 2025
బూతులు మాట్లాడేందుకు లైసెన్స్ ఉందా: సుప్రీంకోర్టు ఆగ్రహం

పేరెంట్స్ సెక్స్‌పై వల్గర్ కామెంట్లు చేసిన <<15458454>>రణ్‌వీర్<<>> అలహాబాదియపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. ‘అతడు తల్లిదండ్రులను అవమానిస్తున్నాడు. అతడి బుర్రలోనే ఏదో బురద ఉంది. ఇలాంటి వ్యక్తికి మేమెందుకు ఫేవర్ చేయాలి? అతడి ప్రోగ్రాముల్లో అంతా అసభ్యతే కనిపిస్తోంది. ఇలాంటి చెత్త లాంగ్వేజ్ మాట్లాడేందుకు మీకేమైనా లైసెన్స్ ఉందా? పాపులారిటీ రాగానే ఏదైనా మాట్లాడొచ్చని భావిస్తున్నారు’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
News February 18, 2025
‘తుని’లో వివాదమేంటి?

AP: తుని మున్సిపల్ <<15498884>>వైస్ ఛైర్మన్<<>> ఎన్నిక నేపథ్యంలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. గత ఎన్నికల్లో 30 వార్డులను YCP గెలుచుకుంది. ఒకరు మృతి చెందగా, మరొకరు రాజీనామా చేశారు. ఇటీవల 10 మంది కౌన్సిలర్లు TDPలో చేరారు. మరో నలుగురి కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందంటూ YCP కౌన్సిలర్లను క్యాంప్‌కు తరలించి చలో తునికి పిలుపునిచ్చింది. పోటీగా TDP కార్యకర్తలు అక్కడికి రావడంతో రచ్చ చెలరేగింది.
News February 18, 2025
ప్రతీకారం తీర్చుకుంటా: షేక్‌హసీనా

ఆవామీలీగ్ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ఆపార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తానని అందరికీ న్యాయం చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనలో ఎంతోమంది కళాకారులు, పోలీసులు, కార్యకర్తలు హత్యకు గురైనా యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.