News May 26, 2024

అమెరికాకు వెళ్లని కోహ్లీ.. కారణమిదే

image

టీ20 వరల్డ్‌కప్ కోసం టీమ్‌ఇండియా ఫస్ట్ బ్యాచ్ అమెరికాకు బయల్దేరింది. పేపర్ వర్క్ పెండింగ్‌లో ఉండటం వల్ల కోహ్లీ న్యూయార్క్‌కి వెళ్లలేకపోయారని, ఈనెల 30న వెళ్తారని క్రీడావర్గాలు తెలిపాయి. రోహిత్, జడేజా, బుమ్రా, సూర్య, దూబే, పంత్, కుల్దీప్, అక్షర్, అర్ష్‌దీప్, సిరాజ్‌తో పాటు రిజర్వ్‌డ్ ప్లేయర్స్ గిల్, ఖలీల్ ఫస్ట్ బ్యాచ్‌లో వెళ్లిన వారిలో ఉన్నారు. వీరితో కోచ్ ద్రవిడ్‌, ఇతర స్టాఫ్ కూడా పయనమయ్యారు.

Similar News

News September 18, 2025

ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (1/2)

image

‘తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం’
పండిత దైవజ్ఞ సూర్య సూరి రచించిన శ్రీ రామకృష్ణ విలోమ కావ్యంలోని శ్లోకమిది. ముందు నుంచి చదివినా, వెనుక నుంచి చదివినా ఈ శ్లోకం ఒకేలాగా(వికటకవి లాగ) ఉంటుంది. ఎడమవైపు నుంచి చదివితే శ్రీరాముణ్ని, కుడివైపు నుంచి చదివితే శ్రీకృష్ణుణ్ని స్తుతించేలా ఉన్న ఈ శ్లోకం అద్భుతం కదా!

News September 18, 2025

ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (2/2)

image

ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి చదివితే ‘ఎవరైతే సీతను కాపాడారో, ఎవరి చిరునవ్వు అందంగా ఉంటుందో, ఏ అవతారం విశేషమైనదో, ఎవరినుంచైతే దయ, అద్భుతమూ ప్రతిచోట వర్షిస్తుందో అట్టి రాముడికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం వస్తుంది. కుడి వైపు నుంచి చదివితే ‘యాదవ కులంలో పుట్టిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను’ అనే అర్థం వస్తుంది. అద్భుతమైన శ్లోకం కదా!

News September 18, 2025

రాబోయే 3 గంటల్లో వర్షం: APSDMA

image

రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వాన కురుస్తుందని తెలిపింది. అటు TGలో HYD, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, MBNR, NLG, కామారెడ్డి, మెదక్, NRPT జిల్లాల్లో ఇవాళ రాత్రి వర్షం పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.