News May 26, 2024

పాక్‌తో ఆడటం కంటే IPL ఆడటం బెటర్: వాన్

image

ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో కంటే IPL ఆడటం బెటర్ అని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నారు. IPL అనుభవంతో టీ20 వరల్డ్ కప్‌లో రాణించవచ్చని చెప్పారు. ‘పాక్‌ను తక్కువగా అంచనా వేయట్లేదు. కానీ IPLలో ఆడితే విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ లాంటి ఆటగాళ్లు మెరికల్లా తయారవుతారు. అక్కడ ఉండే ఒత్తిడి, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ యజమానులు, సోషల్ మీడియా ఇలా అన్నింటి నుంచి వారు ఎంతో కొంత నేర్చుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. సంగారెడ్డి జిల్లా ఎదురుచూస్తోంది..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మంజీరా నదిలో నక్క వాగు నీళ్లు కాలుష్యం కాకుండా చూడాలి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి. ప్యారానగర్ డంప్ యార్డు రద్దు చేయాలి. సింగూరు జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి.

News March 12, 2025

వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

News March 12, 2025

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

image

AP: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వేతన బకాయిలను మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. అలాగే, మెటీరియల్ నిధులతో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులనూ 10 రోజుల్లో చెల్లిస్తామంది. ఈ రెండింటికీ సంబంధించి రూ.2వేల కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్ర ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉన్నతాధికారులను కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన వారు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

error: Content is protected !!