News May 26, 2024
దూసుకొస్తున్న తుఫాన్.. 394 విమానాలు రద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ <<13316903>>తుఫాన్<<>> బెంగాల్ తీరం వైపుగా దూసుకొస్తోంది. ముందు జాగ్రత్తగా ఇవాళ సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు 394 విమానాలను రద్దు చేస్తున్నట్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయం 63 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. తుఫాను తీరం దాటే సమయంలో 80-90Kmph వేగంతో ఈదురుగాలులు, 200mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD వెల్లడించింది.
Similar News
News January 13, 2026
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
News January 13, 2026
షాక్స్‌గామ్ వ్యాలీ.. భారత్‌కు ఎందుకంత కీలకం?

<<18842137>>షాక్స్‌గామ్ వ్యాలీ<<>> భారత్‌కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్‌లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.
News January 13, 2026
షాక్స్‌గామ్ లోయను చైనాకు పాక్ ఎందుకిచ్చింది?

1963లో INDను వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పాక్ షాక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగించింది. USపై నమ్మకం తగ్గడం, 1962 యుద్ధానంతరం చైనాతో స్నేహం ద్వారా రాజకీయ పట్టు సాధించాలని భావించింది. చిన్నపాటి సరిహద్దు వివాదాలనూ ముగించాలనుకుంది. ఈ ఒప్పందంతో POKపై పాక్ నియంత్రణను చైనా గుర్తించింది. బదులుగా కారకోరం పాస్‌పై చైనాకు ఆధిపత్యం దక్కి భారత్‌లోని సియాచిన్, లద్దాక్ ప్రాంతాలకు భద్రతా ముప్పు ఏర్పడింది.


