News May 26, 2024
ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2022 ఏప్రిల్ 30న మనోజ్ పాండేను ఆర్మీ చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 18, 2025
ఈ ఏడాది గరిష్ఠంగానే భారత్ వృద్ధి రేటు: IMF
ఈ ఏడాదికిగానూ ప్రపంచదేశాల వృద్ధి రేటు అంచనాలతో ఐఎంఎఫ్ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది భారత వృద్ధి రేటు గరిష్ఠంగా 6.5గా ఉండగా ఈ ఏడాదీ అదే కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు అడ్వాన్స్‌డ్ ఎకానమీగా పేరొందిన USA వృద్ధి రేటు 2.7గా ఉండొచ్చని పేర్కొంది. మధ్య ఆదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4.2గా అల్ప ఆదాయ దేశాల్లో 4.6గా వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
News January 18, 2025
సైఫ్‌పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
నేడు రాష్ట్రానికి అమిత్ షా
AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్‌లో బస చేయనున్నారు. రేపు గన్నవరంలో సమీపంలోని NIDM సెంటర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.