News May 26, 2024

ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

image

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2022 ఏప్రిల్ 30న మనోజ్ పాండేను ఆర్మీ చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.

Similar News

News February 10, 2025

రంగరాజన్‌ను పరామర్శించిన కొండా సురేఖ

image

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News February 10, 2025

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

image

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.

News February 10, 2025

చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్

image

చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.

error: Content is protected !!