News May 26, 2024

గాయంపై క్లారిటీ ఇచ్చిన నీరజ్

image

గాయం కారణంగా ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్‌‌ పోటీకి నీరజ్ చోప్రా దూరమయ్యారన్న నిర్వాహకుల <<13319465>>ప్రకటనను<<>> ఆయన తోసిపుచ్చారు. ‘నేను గాయపడలేదు. కానీ ఒలింపిక్స్‌కు ముందు రిస్క్ తీసుకోవద్దనే ఆస్ట్రావా సెషన్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా. పూర్తి ఫిట్‌నెస్ సాధించగానే పోటీల్లో పాల్గొంటా. మీ మద్దతుకు ధన్యవాదాలు’ అని నీరజ్ ఇన్‌స్టాలో వెల్లడించారు.

Similar News

News November 8, 2025

కొత్తగా CDF పోస్టు… పాక్ ఆర్మీలో కీలక మార్పు!

image

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ రక్షణ వ్యవహారాల్లో పలు మార్పులు వస్తున్నాయి. భారత CDS మాదిరిగా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల బాధ్యత అప్పగిస్తారని ‘GEONEWS’ పేర్కొంది. సైన్యంపై అధికారం అధ్యక్షుడు, ప్రభుత్వానికి కాకుండా CDFకు ఉంటుందని తెలిపింది. త్వరలో రిటైర్ కానున్న ఆర్మీ చీఫ్ మునీర్‌ రేసులో ఉన్నారని వెల్లడించింది.

News November 8, 2025

బండి సంజయ్ హాట్ కామెంట్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన BJP, ముస్లింల వైపు INC ఉంది. TGని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News November 8, 2025

ఘోర ప్రమాదం.. కారు ఎలా ధ్వంసమైందో చూడండి!

image

UPలోని షమ్లీలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును స్విఫ్ట్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు కజిన్ బ్రదర్స్ చనిపోగా, ఒకరికి రేపు పెళ్లి కావాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు కారులోని భాగాలు 100M దూరంలో పడ్డాయి. వాహనం నామ రూపాల్లేకుండా మారడంపై SMలో చర్చ జరుగుతోంది. కొన్నికార్లలో సేఫ్టీ అధ్వానంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.