News May 26, 2024
గాయంపై క్లారిటీ ఇచ్చిన నీరజ్

గాయం కారణంగా ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ పోటీకి నీరజ్ చోప్రా దూరమయ్యారన్న నిర్వాహకుల <<13319465>>ప్రకటనను<<>> ఆయన తోసిపుచ్చారు. ‘నేను గాయపడలేదు. కానీ ఒలింపిక్స్‌కు ముందు రిస్క్ తీసుకోవద్దనే ఆస్ట్రావా సెషన్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా. పూర్తి ఫిట్‌నెస్ సాధించగానే పోటీల్లో పాల్గొంటా. మీ మద్దతుకు ధన్యవాదాలు’ అని నీరజ్ ఇన్‌స్టాలో వెల్లడించారు.
Similar News
News February 14, 2025
ప్రేమికుల రోజు భార్యలతో క్రికెటర్లు!

వాలంటైన్స్ డే సందర్భంగా పలువురు క్రికెటర్లు తాము ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలతో గడిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి స్పెషల్ లంచ్‌కు వెళ్లిన ఫొటోను షేర్ చేశారు. మరో కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
News February 14, 2025
IPL ఫ్యాన్స్‌కు షాక్!

జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా <<15456249>>ఏర్పడిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే IPL కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘జియో హాట్‌స్టార్’ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘హిందూస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దీనికి 3 నెలలకు రూ.149 చెల్లించాల్సి ఉంటుంది. Ad Free ఆప్షన్ కోసం రూ.499 వెచ్చించాలి. MAR 22 నుంచి IPL ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News February 14, 2025
స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి: శ్రీనివాస వర్మ

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పునరుద్ఘాటించారు. కొన్ని కారణాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.11,400కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. CM CBN, మంత్రి లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.