News May 28, 2024
రాజమౌళి-మహేశ్ సినిమాలో ‘ఆదిపురుష్’ హనుమంతుడు?
రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే నటించనున్నట్లు సమాచారం. ఆయన రాజమౌళితో దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది. దేవదత్త నాగే ‘ఆదిపురుష్’ సినిమాలో హనుమంతుని పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News January 18, 2025
ఓర్వకల్లులో ఈవీ పార్కు.. 25వేల ఉద్యోగాలు!
AP: రాష్ట్రంలో పీపుల్ టెక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహన పార్కు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మొబిలిటీ వ్యాలీలో రూ.1,800 కోట్ల వ్యయంతో 1200 ఎకరాల్లో ఈ వాహన పార్కును నిర్మించనుంది. ఇది పూర్తయితే దాదాపు 25 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
News January 18, 2025
‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్.. రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్
జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని హీరో రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు. అయితే వాటిని పునరావృతం చేయకుండా ఉండటమే కీలకం. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుంది’ అని ఓ షోలో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
News January 18, 2025
భారత జట్టుపై మీ కామెంట్?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టును ప్రకటించగా కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ రెడ్డితో పాటు కరుణ్ నాయర్‌ను తీసుకోకపోవడంపై విమర్శలకు దిగారు. టీమ్‌కి 15 మందే కావాలని అజిత్ అగార్కర్ అనడంపై సెటైర్లు వేస్తున్నారు. జట్టులో ఉన్నవారంతా అద్భుత ప్లేయర్లేనా? అని ప్రశ్నిస్తున్నారు. యంగ్‌స్టర్లకు అవకాశమివ్వాలని, సెంచరీలు చేసిన కరుణ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.