News May 29, 2024

REWIND: చరిత్ర సృష్టించిన SRH

image

IPL: సరిగ్గా ఇదే రోజు 2016లో ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా SRH నిలిచింది. గ్రూప్ స్టేజీలో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్లిన వార్నర్ సేన.. ఎలిమినేటర్‌లో KKRపై, క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. FINALలో ఆర్సీబీతో ఉత్కంఠభరిత పోరులో గెలిచి, కప్పు కొట్టింది. ఒక దశలో ఆర్సీబీకి 9 వికెట్లు చేతిలో ఉండి 44 బంతుల్లో 68 రన్స్ చేయాల్సి ఉన్నా.. SRH అద్భుతంగా పుంజుకుని గెలిచింది.

Similar News

News January 19, 2025

డిప్యూటీ CM పదవికి లోకేశ్ అన్ని విధాలా అర్హుడు: సోమిరెడ్డి

image

AP: మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ CM చేయాలన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు. ‘ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నాక పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. డిప్యూటీ CM పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.

News January 19, 2025

రేషన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేయాలి: హరీశ్ రావు

image

TG: ప్రజాపాలన దరఖాస్తులకూ రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన BRS విజయమని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం పేదల గురించి ఆలోచించదా? అని ప్రశ్నించారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి, భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని కోరారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ఉపాధి హామీ స్కీమ్‌కు లింక్ చేయొద్దన్నారు.

News January 19, 2025

గజగజ.. 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కనిష్ఠంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24/25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.