News January 19, 2025

గజగజ.. 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కనిష్ఠంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24/25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 16, 2025

‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి ఎప్పుడంటే?

image

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ Xలో వెల్లడించింది. ‘అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్లు అందరూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజు’ అని రాసుకొచ్చింది. గత నెల 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

News February 16, 2025

తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ప్రత్యేక అధ్యాయం: CM

image

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి <<15477241>>మరణం<<>> బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. నందమూరి తారక రామారావు నట జీవితానికి తొలుత అవకాశం ఇచ్చింది కృష్ణవేణే అని గుర్తు చేసుకున్నారు. ఇటీవల NTR సెంటినరీ, వజ్రోత్సవ వేడుకల్లో ఆమెను సత్కరించానని తెలిపారు.

News February 16, 2025

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా?

image

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. HYD నుంచి విజయవాడ వెళ్లేవారు నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!