News May 30, 2024

డిజిటల్ ఫ్రాడ్స్ రెండేళ్లలో 708% పెరిగాయి: RBI

image

దేశంలో గత రెండేళ్లలో బ్యాంక్ ఫ్రాడ్స్ 300%, డిజిటల్ ఫ్రాడ్స్ 708% పెరిగినట్లు RBI వెల్లడించింది. FY22లో 9,046 బ్యాంక్ ఫ్రాడ్ కేసులు నమోదు కాగా FY24కి ఆ సంఖ్య 36,075కు చేరింది. అయితే వీటితో నష్టపోయిన మొత్తం రూ.45,358 కోట్ల నుంచి రూ.13,930 కోట్లకు తగ్గింది. డిజిటల్ ఫ్రాడ్ కేసులు FY22లో 3,596 ఉండగా గత FYలో ఆ సంఖ్య 29,082కు పెరిగింది. కాగా నేరాలను గుర్తించడంలోనూ ఆలస్యం జరుగుతున్నట్లు RBI పేర్కొంది.

Similar News

News October 16, 2024

అందుకే రేస్ కార్ల జోలికి వెళ్లట్లేదు: నాగచైతన్య

image

తనకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టమని హీరో నాగచైతన్య చెప్పారు. కొత్త రకం బైక్, కారు ఏది కనిపించినా వెంటనే డ్రైవ్ చేసేవాడినని తెలిపారు. సినిమాలతో బిజీగా మారడంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వేగంగా వెళ్లొద్దని సన్నిహితులు సూచించడంతో రేసింగ్‌కు దూరమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు.

News October 16, 2024

ఒమర్ అబ్దుల్లాకు శుభాకాంక్షలు: మోదీ

image

జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అందుకు ఒమర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NC, కాంగ్రెస్ కూటమి మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

News October 16, 2024

సొంత అవసరాలకు ప్రజాధనం వినియోగం: నారా లోకేశ్

image

AP: జగన్ అధికారంలో ఉన్న సమయంలో సొంత అవసరాలకు ప్రజా ధనాన్ని ఉపయోగించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచె వేసేందుకు రూ.12.85 కోట్లు వినియోగించారని పేర్కొన్నారు. పేదల ఇళ్ల కోసం ఉపయోగించాల్సిన డబ్బును అత్యవసర భద్రతా కారణాలు చెప్పి వాడుకున్నారని దుయ్యబట్టారు. తన ఆనందాల కోసం ప్రజాధనాన్ని వినియోగించిన జగన్ సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.