News January 20, 2025
మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం.. యోగికి మోదీ ఫోన్

మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు సంఘటనా స్థలాన్ని యోగి పరిశీలించారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక అధికారులు ఆయనకు తెలియజేశారు. కాగా సిలిండర్ పేలుడు వల్లే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.
Similar News
News February 15, 2025
రేవంత్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: సీఎం స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. అటు మండల్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని, బీజేపీ వచ్చాకే అమలుపర్చిందని తెలిపారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
News February 15, 2025
5 ఖండాలను లింక్ చేస్తూ మెటా కేబుల్.. భారత్ కీ రోల్!

భారత్ సాయంతో ప్రపంచంలో అతి పొడవైన సముద్ర కేబుల్ వేసేందుకు మెటా కంపెనీ ప్లాన్ చేస్తోంది. 5 ఖండాలను లింక్ చేస్తూ 50వేల కి.మీ మేర సముద్రం లోపల కేబుల్ వేయనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు అని, ఏఐ సర్వీసులు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు మెయింటనెన్స్, ఫైనాన్సింగ్‌లో భారత్ కీలకపాత్ర పోషించనుంది.
News February 15, 2025
రూ.100 కోట్లకు చేరువలో ‘తండేల్’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.