News May 31, 2024

ఏపీ ‘ఉప్పు’కు డిమాండ్.. రైతుల సంతోషం

image

AP: తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో AP ఉప్పుకు డిమాండ్ పెరిగింది. వారం కిందట వరకు 75KGల బస్తా ₹100-₹150 పలకగా, ఇప్పుడు ₹200 దాటింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. గతంలో ఎకరాకు 800-900 బస్తాల దిగుబడి వస్తుండగా, ఈసారి 1,300-1,400 వరకు వస్తోంది. రేటు కూడా పెరగడంతో దాదాపు 7 వేల మంది రైతులు, 10 వేలకు పైగా కూలీలకు లబ్ధి చేకూరుతోంది.

Similar News

News October 14, 2024

టచ్ చేస్తే నరికేయండి.. అమ్మాయిలకు కత్తుల పంపిణీ

image

బిహార్‌లోని సీతామర్హికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ విద్యార్థినులకు కత్తులు పంపిణీ చేశారు. అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులను నరికేయాలని పిలుపునిచ్చారు. విజయదశమి వేడుకల్లో భాగంగా కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించారు. సోదరీమణులను తాకడానికి కూడా ఎవరూ ధైర్యం చేయకూడదని, చేస్తే నరికేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలకు ప్రజలూ మద్దతు తెలపాలని కోరారు.

News October 14, 2024

హ్యాపీ బర్త్ డే లెజెండ్: ఢిల్లీ క్యాపిటల్స్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ విషెస్ తెలిపింది. ‘తన పనిపట్ల ఎంతో కమిటెడ్‌గా ఉంటారు. పేరుకు తగ్గట్లు అంత గంభీరంగా ఉండరు. కానీ, చాలా అగ్రెసివ్, బెస్ట్ టీచర్’ అని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. పైన తెలిపిన వాటిలో పట్టు సాధించిన లెజెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది. గంభీర్ ఇన్నింగ్స్‌లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.

News October 14, 2024

9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర?

image

ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర పన్నినట్లు IDF తెలిపింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టెల్ అవీవ్‌లోని 70 అంతస్తుల భవనం మోషే అవివ్, ఇజ్రాయెల్ టవర్లను నేలమట్టం చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ రికార్డుల్లో ఇరాన్ ప్రతినిధులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ జరిపిన సంభాషణలు కూడా ఉన్నట్లు తెలిపింది.