News May 31, 2024

రోహిత్ భాయ్ యూత్‌కు చాలా సపోర్ట్ చేస్తారు: కుల్దీప్

image

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుంటారని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపారు. ‘రోహిత్ భాయ్ యూత్‌కు చాలా మద్దతు ఇస్తారు. టీమ్‌లోకి వచ్చిన కొత్త ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. నా బౌలింగ్‌ను కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అది నాకు చాలా సహాయపడింది. అతని మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Similar News

News January 20, 2025

నేను నేరం చేయలేదు: సంజయ్ రాయ్

image

తాను తప్పు చేయలేదని కలకత్తా హత్యాచార ఘటన దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తీర్పు ఖరారుపై కాసేపటి క్రితం సీల్దా కోర్టులో వాదనలు ప్రారంభం కాగా, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. కాగా 2024 AUG 9న RG Kar ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ దారుణ హత్యాచారానికి గురైంది. ఆ మరుసటి రోజు మాజీ పోలీస్ కాంట్రాక్టు ఉద్యోగి <<15203033>>సంజయ్<<>> ఈ కేసులో అరెస్టయ్యాడు.

News January 20, 2025

‘హిండెన్‌బర్గ్’ అండర్సన్‌పై మోసం కేసు నమోదుకు ఆస్కారం!

image

US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ యజమాని అండర్సన్‌పై సెక్యూరిటీ ఫ్రాడ్ కేసు నమోదవ్వొచ్చని సమాచారం. కంపెనీలే టార్గెట్‌గా రిపోర్టులు రూపొందించేందుకు హెడ్జ్‌ఫండ్ కంపెనీలతో కుమ్మక్కైనట్టు ఆంటారియో కోర్టులో దాఖలైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. షేర్ల ట్రేడింగులో పాల్గొంటున్నట్టు చెప్పకుండా బేరిష్ రిపోర్టులను రూపొందించడం US SEC ప్రకారం నేరమని ఆ నివేదిక నొక్కిచెప్పింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం తెలిసిందే.

News January 20, 2025

‘పిల్లలతో పెద్దవారిని తిట్టిస్తే కామెడీనా?’.. నెట్టింట విమర్శలు

image

విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లిరాజు క్యారెక్టర్ థియేటర్లలో నవ్వులు తెప్పించిందని చాలామంది చెప్తున్నారు. అయితే, కొందరు మాత్రం అలాంటి క్యారెక్టర్‌ను ఎంకరేజ్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘పిల్లలతో పెద్దలను బూతులు తిట్టించడం కామెడీనా? ఇది చూసి పిల్లలతో కలిసి పెద్దలూ నవ్వుతున్నారు. మీ పిల్లలూ అలా తిడితే ఎలా?’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ బుల్లిరాజు పాత్రపై మీ కామెంట్?