News May 31, 2024
వివేకానంద రాక్ మెమోరియల్‌లో అప్పుడు.. ఇప్పుడు
ఏక్తా యాత్ర సందర్భంగా 1991లో కన్యాకుమారిలోని ఐకానిక్ ‘వివేకానంద రాక్ మెమోరియల్’ వద్ద ప్రధాని మోదీ తీసుకున్న ఫొటో తాజాగా వైరలవుతోంది. బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి, మోదీ వివేకానందుడికి నివాళులర్పించారు. అప్పుడు సాధారణ బీజేపీ కార్యకర్తగా అక్కడికి వెళ్లిన మోదీ.. ఇప్పుడు 45 గంటల పాటు ధ్యానం చేపట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిశాక కేదార్‌నాథ్ గుహలో ఆయన ధ్యానం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 20, 2025
దోషికి జీవిత ఖైదు.. మమత అసంతృప్తి
ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసు తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశామని, కానీ కోర్టు జీవిత ఖైదు విధించిందని చెప్పారు. ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని అన్నారు. ఒకవేళ పోలీసుల చేతుల్లోనే ఉంటే వారు దోషికి మరణశిక్ష పడేలా వందశాతం ప్రయత్నించే వారని పేర్కొన్నారు.
News January 20, 2025
స్టార్ హీరోపై దాడి.. దొంగను పట్టించిన గూగుల్ పే
సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన దొంగను పట్టుకోవడంలో గూగుల్ పే కీలకంగా మారింది. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడు షరీఫుల్ ఇస్లాం వర్లీలో పరోటా తిని వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. వాటికి గూగుల్ పే ఉపయోగించాడు. ఇస్లాం నంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఆ లొకేషన్‌కు వెళ్లారు. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిపై టార్చ్ లైట్ వేసి చూడగా అతడు పరుగు తీశాడు. అతడిని పట్టుకోగా ఆ వ్యక్తే నిందితుడని తేలింది.
News January 20, 2025
Stock Markets: ఉరకలెత్తిన సూచీలు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, బ్యాంకు, ఫైనాన్స్ స్టాక్స్ అండతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 77,073 (+454), నిఫ్టీ 23,344 (+141) వద్ద ముగిశాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ కొనసాగింది. కొటక్ బ్యాంకు, విప్రో, బజాజ్ ట్విన్స్, NTPC టాప్ గెయినర్స్. SBI లైఫ్, TRENT, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC లైఫ్, అదానీ SEZ టాప్ లూజర్స్.