News June 1, 2024

నేడే తుది విడత పోలింగ్.. సా.6 నుంచి ఎగ్జిట్ పోల్స్

image

లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో జరగనుంది. నరేంద్ర మోదీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులతో సహా మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సా.6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కోసం రాజకీయ నేతలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News October 13, 2024

PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి. క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు.

News October 13, 2024

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోంది: హరీశ్

image

TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్‌గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.

News October 13, 2024

రాష్ట్ర పండుగగా ‘వాల్మీకి జయంతి’

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17న వాల్మీకి జయంతిని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. అనంతపురంలో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించనుంది. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.