News January 20, 2025

భారీగా IPSల బదిలీ

image

APలో 27 మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
*పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనా
*కర్నూల్ ఎస్పీగా విక్రాంత్ పాటిల్
*కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్
*ఎర్రచందనం యాంటీ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడు
*తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
*ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పాలరాజు
*IGP ఆపరేషన్స్‌గా సీహెచ్ శ్రీకాంత్

Similar News

News February 7, 2025

పోస్టులు తానే పెట్టినట్లు ఒప్పుకొన్న ఆర్జీవీ?

image

AP: సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోల పోస్టుల కేసుపై ఒంగోలులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో RGV కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ‘చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలను మార్ఫ్ చేసి నేనే నా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశా. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగానే పోస్టులు చేశా. ఈ విషయంలో YCP నేతలకు సంబంధం లేదు. వారితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి’ అని చెప్పినట్లు సమాచారం.

News February 7, 2025

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. WAY2NEWSలో ఎక్స్‌క్లూజివ్‌గా

image

యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఉ.7 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ప్రతి అప్‌డేట్‌ను WAY2NEWS మీకు ఎక్స్‌క్లూజివ్‌గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్‌లో చూడవచ్చు.70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ BJPకే మొగ్గుచూపగా, కొన్ని AAPకూ అవకాశం ఉందని అంచనా వేశాయి.

News February 7, 2025

ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు

image

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్‌ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన US వెళ్లనున్నారు.

error: Content is protected !!