News June 1, 2024
పుణే ప్రమాదం: మైనర్ తల్లి అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటనలో మైనర్ బాలుడి <<13342922>>తల్లి<<>>ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ నిందితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ ఘటనలో మైనర్ తండ్రి, తాతతో పాటు ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 21, 2025
దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ..: అంబటి
AP: లోకేశ్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ.. లోకేశ్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు’ అని ట్వీట్ చేశారు. భరత్ వ్యాఖ్యలపై CM చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. లోకేశ్‌ను Dy.CM చేయాలన్న పలువురి నేతల వ్యాఖ్యలపై స్పందించిన అధిష్ఠానం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఇప్పటికే ఆదేశించింది.
News January 21, 2025
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ఎటాక్ మధ్య తేడా ఇదే!
చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపుతుంది. అప్పుడు CPR చేయాలి. మెదడుకు రక్తాన్ని పంప్ చేయకపోవడంతో వ్యక్తి స్పృహ కోల్పోతాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అవుతాయి. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆ రోగికి యాంజియోప్లాస్టీ చేయాలి. చికిత్స చేయకపోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది.
News January 21, 2025
జనవరి 21: చరిత్రలో ఈరోజు
1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం