News January 21, 2025
దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ..: అంబటి

AP: లోకేశ్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ.. లోకేశ్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు’ అని ట్వీట్ చేశారు. భరత్ వ్యాఖ్యలపై CM చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. లోకేశ్‌ను Dy.CM చేయాలన్న పలువురి నేతల వ్యాఖ్యలపై స్పందించిన అధిష్ఠానం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఇప్పటికే ఆదేశించింది.
Similar News
News February 18, 2025
పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.
News February 18, 2025
సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(1/2)

AP: ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – పర్ డ్రాప్ మోర్ క్రాప్’ స్కీమ్‌లో భాగంగా సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర పరికరాలకు ప్రభుత్వం సబ్సిడీలు ఖరారు చేసింది. వీటికోసం సమీపంలోని వ్యవసాయ కేంద్రాల్లో సంప్రదించాలి. మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు పరికరాలు అందిస్తారు.
✒ 5ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు పరికరాలపై 100% సబ్సిడీ
✒ ఇతర సన్న, చిన్నకారు అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹2.18 లక్షలు)
News February 18, 2025
సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(2/2)

✒ రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు రైతులు, గిరిజన అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹3.14 లక్షలు).
✒ కోస్తా జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు 70%(గరిష్ఠంగా ₹3.10 లక్షలు), పది ఎకరాలు పైబడిన వారికి 50 శాతం(గరిష్ఠంగా ₹4లక్షలు).
✒ అన్ని సామాజికవర్గాల్లో 5 ఎకరాల్లోపు తుంపర పరికరాలకు దరఖాస్తు చేసిన వారికి 50%(₹19వేలు), 12.5 ఎకరాల్లోపు వారికి 50 శాతం(₹19వేలు) సబ్సిడీ అందనుంది.