News June 1, 2024
ఇవాళ బీఆర్ఎస్ నేతల క్యాండిల్ ర్యాలీ
TG: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు BRS సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇవాళ HYD గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున్న అమరజ్యోతి వరకు BRS నేతలు, కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి KCR అధ్యక్షత వహిస్తారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఇతర అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం.
Similar News
News January 21, 2025
దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ..: అంబటి
AP: లోకేశ్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ.. లోకేశ్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు’ అని ట్వీట్ చేశారు. భరత్ వ్యాఖ్యలపై CM చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. లోకేశ్‌ను Dy.CM చేయాలన్న పలువురి నేతల వ్యాఖ్యలపై స్పందించిన అధిష్ఠానం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఇప్పటికే ఆదేశించింది.
News January 21, 2025
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ఎటాక్ మధ్య తేడా ఇదే!
చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపుతుంది. అప్పుడు CPR చేయాలి. మెదడుకు రక్తాన్ని పంప్ చేయకపోవడంతో వ్యక్తి స్పృహ కోల్పోతాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అవుతాయి. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆ రోగికి యాంజియోప్లాస్టీ చేయాలి. చికిత్స చేయకపోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది.
News January 21, 2025
జనవరి 21: చరిత్రలో ఈరోజు
1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం