News June 1, 2024

టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం: పిన్నెల్లి

image

AP: కౌంటింగ్ రోజున ఓటమి భయంతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలు, కార్యకర్తలు ఓట్ల లెక్కింపునకు ముందు, ఫలితాలు వెలువడిన తర్వాత సంయమనంతో వ్యవహరించాలని ట్వీట్ చేశారు. కాగా, ఈవీఎం ధ్వంసంతో పాటు సీఐ, టీడీపీ ఏజెంట్‌పై దాడి, మహిళపై దుర్భాషలాడిన కేసుల్లో పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News October 13, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

సాధారణంగా దసరా రోజు తెలంగాణలో నాన్‌వెజ్ వంటకాలే చేస్తారు. అయితే నిన్న శనివారం కావడంతో ఎక్కువశాతం మంది వెజ్‌కే పరిమితమయ్యారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్, మటన్ కోసం మార్కెట్లకు క్యూ కడుతున్నారు. దీంతో HYDతో పాటు APలోని విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. అయితే 2 రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్‌లెస్ కేజీ రూ.240-260 మధ్య పలుకుతోంది.

News October 13, 2024

టీతోపాటు సిగరెట్ తాగుతున్నారా?

image

చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. కానీ దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో క్యాన్సర్, నపుంసకత్వం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి శరీరంలో జీర్ణ కణాలనూ దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్తి, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు మానలేకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

News October 13, 2024

వీరిలో పర్మినెంట్ వికెట్ కీపర్ ఎవరో?

image

ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. టీ20ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. నిన్న బంగ్లాతో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో శాంసన్ ఈ రేసులో మరింత ముందుకు దూసుకొచ్చారు. ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి.