News June 2, 2024

బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత?

image

ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడైన రెండు రోజుల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి.

Similar News

News January 23, 2025

బాలీవుడ్ సెలబ్రిటీలకు పాక్ నుంచి బెదిరింపు మెయిల్స్!

image

బాలీవుడ్ సెలబ్రిటీలను చంపేస్తామంటూ మెయిల్స్ రావడం కలకలం సృష్టిస్తోంది. కమెడియన్ కపిల్ శర్మ, యాక్టర్ రాజ్‌పాల్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, సింగర్ సుంగధ మిశ్రాకు బుధవారం మెయిల్స్ వచ్చాయి. ‘మిమ్మల్ని గమనిస్తున్నాం. మాది పబ్లిక్ స్టంట్ కాదు. మీరు స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవు’ అని అందులో బెదిరించారు. దీంతో వారు FIR నమోదు చేశారు. మెయిల్, IP అడ్రస్‌ను ట్రేస్ చేయగా పాక్‌ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.

News January 23, 2025

IT దాడులు.. డాక్యుమెంట్లు స్వాధీనం

image

హైదరాబాద్‌లో 3వ రోజు సినీ ప్రముఖుల ఇళ్లల్లో <<15230852>>దాడులు <<>>చేస్తున్న IT అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ సంస్థల వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను సైతం చెక్ చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదయ్యాకే సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

News January 23, 2025

భార్యను నరికి తలకాయ కాల్చగా..

image

TG: నరరూప రాక్షసుడు గురుమూర్తి భార్యను చంపిన <<15230164>>ఘటనలో<<>> మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. భార్యను ముక్కలు చేసిన అతడు తలకాయను కాల్చగా చుట్టుపక్కల వాళ్లకు వాసన వచ్చినట్లు తెలిసింది. అయితే సంక్రాంతి పండగ కావడంతో మేక తలకాయ కావొచ్చని అనుకున్నారట. ఇక భార్య శరీరాన్ని ముక్కలు చేయడాన్ని అతడు వీడియో తీసినట్లు సమాచారం. బాడీని మాయం చేసేందుకు గురుమూర్తి పలుమార్లు ‘దృశ్యం’ సినిమా చూసినట్లు తేలింది.