News June 2, 2024
బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత?
ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడైన రెండు రోజుల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి.
Similar News
News September 17, 2024
ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్టేడియం
ఢిల్లీలో కొత్తగా ద్వారక అంతర్జాతీయ స్టేడియం నిర్మించనున్నారు. దీనిని క్రికెట్ కమ్ ఫుట్‌బాల్ స్టేడియంగా DDA (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ) రూపొందించనుంది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ వంటి ఆటలు ఆడేందుకు సౌకర్యాలు ఉంటాయి. 30 వేల మంది కెపాసిటీతో దీనిని నిర్మిస్తారు. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి 2027 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తారు.
News September 17, 2024
జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేశారు: బాధితురాలు
జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల కేసులో అతని భార్య వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు పేర్కొంది. అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి తెగబడేవాడని ఆమె తెలిపింది. వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు వెల్లడించింది.
News September 17, 2024
అర్ధరాత్రయినా నిద్రపోకపోతే..
అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉండటం మంచి అలవాటు కాదని యశోదా ఆస్పత్రి వైద్యుడు దిలీప్ గూడె హెచ్చరిస్తున్నారు. ‘ప్రకృతిసిద్ధంగా మన శరీరం రాత్రుళ్లు నిద్రపోయి పగలు పనిచేయాలి. ఒంట్లో సమస్యల్ని శరీరం నిద్రలోనే రిపేర్ చేసుకుంటుంది. అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటే నాణ్యమైన నిద్ర ఉండదు. దీని వలన బాడీ అలసిపోవడమే కాక రోగ నిరోధక శక్తి తగ్గి దీర్ఘకాలికంగా పలు రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది’ అని వివరించారు.