News June 2, 2024

అరుణాచల్‌ ప్రజలు పట్టం కట్టేదెవరికో?

image

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థులు లేక BJP ఇప్పటికే పది చోట్ల విజేతగా నిలిచింది. నేడు వెల్లడికానున్న మిగిలిన 50 స్థానాల ఫలితాలపైనా BJP ధీమాగా ఉంది. మరోవైపు నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 సీట్లలోనే పోటీకి పరిమితమైంది. పేపర్ లీక్స్‌తో ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా.

Similar News

News February 9, 2026

పూజా మందిరంలో దీపం పెడుతున్నారా?

image

నిత్య దీపారాధనతో ఇంట్లో శుభం కలుగుతుంది. అయితే కొన్ని నియమాలతో మరిన్ని పుణ్యఫలాలు లభిస్తాయి. అవి.. దీపాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. తూర్పు వైపు పెడితే ఆరోగ్యం, ఉత్తరం వైపు పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తాయి. శివునికి ఎడమ, విష్ణువుకు కుడి వైపు దీపం ఉంచాలి. ఇందుకు ఆవు నెయ్యి శ్రేష్ఠం. ఒకే వత్తితో దీపం వెలిగించరాదు. కాలిన వత్తితో ఓ పరిహారం పాటిస్తే మంచి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News February 9, 2026

పెరిగిన ఎండలు..

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొదలయ్యాయి. TGలోని ప్రధాన నగరాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయని వాతావరణశాఖ తెలిపింది. గరిష్ఠంగా ఖమ్మంలో 34 డిగ్రీలు, హనుమకొండ, మెదక్, నిజామాబాద్‌లో 32 డిగ్రీలు నమోదయ్యాయని పేర్కొంది. అటు ఏపీలోని కావలిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా రికార్డైంది. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

News February 9, 2026

ఆముదంతో వృద్ధాప్య ఛాయలు దూరం

image

ఆముదం నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. ఆముదం ముఖ ముడతలకు సహజమైన చికిత్స. ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దానిలో హైడ్రేటింగ్, పోషకాలు లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా మృదువుగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.