News June 2, 2024
అరుణాచల్ ప్రజలు పట్టం కట్టేదెవరికో?
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థులు లేక BJP ఇప్పటికే పది చోట్ల విజేతగా నిలిచింది. నేడు వెల్లడికానున్న మిగిలిన 50 స్థానాల ఫలితాలపైనా BJP ధీమాగా ఉంది. మరోవైపు నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 సీట్లలోనే పోటీకి పరిమితమైంది. పేపర్ లీక్స్‌తో ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా.
Similar News
News September 19, 2024
టూరిజాన్ని గాడినపెట్టేందుకు కృషి: మంత్రి దుర్గేశ్
AP: రాష్ట్రంలో టూరిజాన్ని తిరిగి గాడినపెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. వచ్చే నెల 15 కల్లా టూరిజంపై DPR రూపొందించి కేంద్రానికి ఇస్తామని మీడియాతో తెలిపారు. స్వదేశీ టూరిజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు సహకరిస్తామని చెప్పారు. నంది అవార్డుల ప్రదానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
News September 19, 2024
చెప్పిన తేదీకే మెగాస్టార్ ‘విశ్వంభర’ విడుదల
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీలో మార్పులుంటాయని వస్తోన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘10-1-2025 విజృంభణం.. విశ్వంభర ఆగమనం!’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘విశ్వంభర’ సంక్రాంతికి రిలీజ్ అవనుంది. అయితే, మూవీ టీజర్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు నెలలు కూడా లేదని, అప్డేట్స్ ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు.
News September 19, 2024
ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి: షర్మిల
AP: తిరుమలను అపవిత్రం చేస్తూ TDP, YCPలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న CBN వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి. లేదా CBIతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి’ అని ట్వీట్ చేశారు.