News June 4, 2024

అమరావతి ఓటు ఎటువైపు?

image

AP: రాజధాని అమరావతి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లా గుంటూరు. ఇటు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో సైతం రాజధాని ప్రభావం కనిపిస్తోంది. రెండు జిల్లాల్లో మొత్తం 33(గుంటూరు 17, కృష్ణా 16) నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరులో YCP 15, TDP 2 స్థానాల్లో, ఉమ్మడి కృష్ణాలో YCP 15 గెలిస్తే, TDP ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. మరి ఈసారి రాజధాని అంశంతో తమకు ఎక్కువ సీట్లు రావొచ్చని టీడీపీ లెక్కలు వేస్తోంది.

Similar News

News September 14, 2025

అక్టోబర్ 1న అకౌంట్లోకి రూ.15,000

image

AP: వాహనమిత్ర కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 13నాటికి ఉన్న పాత జాబితాను పరిశీలిస్తారు. కొత్తవారు ఈ నెల 17-19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 22వ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి 24న అర్హుల జాబితా ప్రకటిస్తారు. అక్టోబరు 1న అకౌంట్లలో నగదు జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2.90లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం.

News September 14, 2025

నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

image

TG: నేడు రాష్ట్రంలోని 5 జిల్లాలకు వాతావరణశాఖ భారీ వర్షసూచన చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. నిన్న హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో వాన పడిన విషయం తెలిసిందే.

News September 14, 2025

నేటి నుంచి తిరుపతిలో మహిళా సాధికార సదస్సు

image

AP: తిరుపతిలో నేటి నుంచి 2రోజుల పాటు జాతీయ మహిళా సాధికార సదస్సు జరగనుంది. ప్రారంభోత్సవానికి CM చంద్రబాబు హాజరై ప్రసంగించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల సభ్యులు పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. దేశ‌వ్యాప్తంగా 200 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు రానుండగా ఏర్పాట్లు పూర్తి చేశారు.