News June 4, 2024

అమరావతి ఓటు ఎటువైపు?

image

AP: రాజధాని అమరావతి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లా గుంటూరు. ఇటు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో సైతం రాజధాని ప్రభావం కనిపిస్తోంది. రెండు జిల్లాల్లో మొత్తం 33(గుంటూరు 17, కృష్ణా 16) నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరులో YCP 15, TDP 2 స్థానాల్లో, ఉమ్మడి కృష్ణాలో YCP 15 గెలిస్తే, TDP ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. మరి ఈసారి రాజధాని అంశంతో తమకు ఎక్కువ సీట్లు రావొచ్చని టీడీపీ లెక్కలు వేస్తోంది.

Similar News

News September 10, 2024

M&M, డాక్టర్ రెడ్డీస్ నుంచి సెబీ చీఫ్‌కు కోట్లలో ఆదాయం: కాంగ్రెస్

image

M&M, డాక్టర్ రెడ్డీస్ సహా ఇతర లిస్టెడ్ కంపెనీల నుంచి సెబీ చీఫ్ మాధబీ బుచ్ రూ.కోట్లలో ఆదాయం పొందారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. సెబీలో చేరినప్పటి నుంచి ఆమెకు చెందిన అగోరా అడ్వైజర్ కంపెనీ సుప్తావస్థలో ఉందంటున్నా 2016-2024 మధ్య రూ.2.95 కోట్లు పొందారని పేర్కొన్నారు. పిడిలైట్, ICICI, సెంబ్‌కార్ప్, విసు లీజింగ్ వారి క్లెయింట్లేనని చెప్పారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందన్నారు.

News September 10, 2024

కొత్త లైన్‌కు అనుమతివ్వండి.. రైల్వే మంత్రికి బండి వినతి

image

TG: కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆయన నివాసంలో వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఉప్పల్ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. దీంతో పాటు జమ్మికుంటలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఆగేలా ఆదేశించాలన్నారు. తన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బండి ట్వీట్ చేశారు.

News September 10, 2024

భారత స్టేడియంపై అఫ్గానిస్థాన్ టీమ్ ఆగ్రహం

image

అఫ్గానిస్థాన్ జట్టు తమ హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుంటుంది. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్టేడియంలో ఆ జట్టు న్యూజిల్యాండ్‌తో సోమవారం నుంచి టెస్టు ఆడాల్సి ఉంది. వర్షం లేకపోయినా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రౌండ్ చిత్తడిగా ఉండి తొలి రెండ్రోజుల మ్యాచ్ రద్దైంది. దీంతో అఫ్గాన్ జట్టు సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టేడియంలో ఇంకెప్పుడూ మ్యాచులు ఆడేది లేదని మండిపడ్డారు.