News June 4, 2024
లీడింగ్‌లో మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ

దేశంలో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ దాటింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 290 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాత్రం కోయంబత్తూరులో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా చెన్నై వెస్ట్‌లో వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 222 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది.
Similar News
News January 12, 2026
వెనిజులా అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా డెల్సీ రోడ్రిగ్స్ నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై పూర్తి ఆధిపత్యం కోసం చూస్తున్న ట్రంప్ ఏకంగా అధ్యక్షుడిని తానేనంటూ పై ఫొటోను పోస్ట్ చేశారు.
News January 12, 2026
INDvsNZ.. తొలి వన్డేలో నమోదైన రికార్డులు

⋆ వన్డేల్లో భారత్ 300+ టార్గెట్ ఛేజ్ చేయడం ఇది 20వ సారి. ఈ లిస్టులో భారత్‌దే టాప్ ప్లేస్
⋆ అత్యధిక సార్లు(5) వన్డేల్లో వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో 50+ స్కోర్ చేసిన ఆటగాడిగా కోహ్లీ
⋆ 2025CT తర్వాత వన్డేల్లో NZకి ఇదే తొలి ఓటమి
⋆ 2023 నుంచి వన్డేల్లో NZపై భారత్‌కు వరుసగా ఇది ఎనిమిదో విక్టరీ
⋆ NZపై IND ఛేజ్ చేసిన రెండో హైయెస్ట్ స్కోర్(301) ఇదే
News January 12, 2026
టీచర్లకు ‘పరీక్ష’!

AP: టెట్‌లో <<18811070>>ఫెయిలైన<<>> ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలకు పాఠాలు బోధిస్తూ ప్రిపేర్ అవ్వడం కుదరలేదని వాపోతున్నారు. 150మార్కుల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60, మిగతావాటి నుంచి 90 మార్కులకు ప్రశ్నలిచ్చారు. దీంతో లాంగ్వేజ్, సోషల్ టీచర్లకు ఇది సులభమే అయినా సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందిగా మారింది. అయితే టీచర్లకు టెట్ మినహాయింపుపై కేంద్రం <<18828506>>పునరాలోచన<<>> వార్తలు ఉపశమనం కలిగిస్తున్నాయి.


