News June 4, 2024
లీడింగ్‌లో మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ
దేశంలో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ దాటింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 290 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాత్రం కోయంబత్తూరులో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా చెన్నై వెస్ట్‌లో వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 222 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది.
Similar News
News November 2, 2024
TODAY HEADLINES
* AP: దీపం-2 పథకం ప్రారంభం
* త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు: చంద్రబాబు
* షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్
* రెడ్ బుక్ విషయంలో తగ్గేదే లేదు: లోకేశ్
* TG: విద్యార్థులకు కొత్త డైట్ ప్లాన్: రేవంత్
* TG: కులగణన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు
* రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్
* ముగిసిన తొలి రోజు ఆట.. కీలక వికెట్లు కోల్పోయిన భారత్
News November 2, 2024
TDP గూటికి కరణం బలరామ్?
AP: వైసీపీ సీనియర్ నేత కరణం బలరామ్ ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన TDP లేదా జనసేనలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. తన కుమారుడు కరణం వెంకటేశ్ కూడా పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ వేడుకలో CM చంద్రబాబుతో బలరామ్ ఆప్యాయంగా మాట్లాడారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గత ఎన్నికల్లో చీరాల నుంచి YCP తరఫున వెంకటేశ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
News November 2, 2024
చలి మొదలైంది.. వీటిని తింటున్నారా?
కొన్ని ప్రాంతాల్లో చలి ప్రారంభమైంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోకపోతే చలికి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఓ టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది. చిలగడదుంపలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉసిరి తింటే అనేక ఔషధాలు తిన్నట్లే. ఖర్జూరాలు, బెల్లం తింటే వేడిని పుట్టిస్తాయి. మిల్లెట్స్, నట్స్, ఆవాలు, నువ్వులు కూడా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.