News June 4, 2024

జగన్ వస్తానన్నా.. జనం వద్దన్నారు

image

‘విశాఖనే పరిపాలనా రాజధాని చేస్తాం.. పాలన ఇక్కడి నుంచే చేస్తా.. జూన్-9న రెండోసారి CMగా ప్రమాణస్వీకారం ఇక్కడే చేస్తా’ అని CM జగన్ చెప్పిన మాటలను విశాఖ ప్రజలు పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలో 15 స్థానాలకు 11 స్థానాల్లో గెలిచిన YCP.. ఈసారి 2స్థానాల్లో(అరకు, పాడేరు)నే ఆధిక్యంలో ఉంది. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న YCP హామీని ప్రజలు విశ్వసించలేదని తాజా ఫలితాలు చెబుతున్నాయి.

Similar News

News September 12, 2025

ఈ నెల 16 నుంచి MBBS, BDS కౌన్సెలింగ్

image

TG: MBBS, BDS ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. 15న జనరల్ మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో పెట్టనుండగా, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ 16న ప్రారంభవుతుంది. 17-19 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20-24 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్, 2nd ఫేజ్‌లో 26-28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 29న కాలేజీల్లో రిపోర్టింగ్ ఉంటుంది.

News September 12, 2025

దసరాకు ‘ఆదిత్య 999’ సినిమా ప్రకటన?

image

క్రిష్ జాగర్లమూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ‘ఆదిత్య 999’ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై దసరా పండుగ రోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి బాలయ్యే స్టోరీ అందించినట్లు సమాచారం. గతంలో క్రిష్-బాలయ్య కాంబోలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

News September 12, 2025

AP న్యూస్ రౌండప్

image

✶ శ్రీశైలం ప్రాజెక్టు, తుంగభద్ర, కాటన్ బ్యారేజ్, గోరకల్లు జలాశయం మరమ్మతులకు రూ.455Cr మంజూరు చేసిన ప్రభుత్వం.. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
✶ డిగ్రీ ప్రవేశాల గడువు 13వ తేదీ వరకు పొడిగింపు
✶ ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు
✶ ఈడిగ, గౌడ (గమల్ల), కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశయన (సెగిడి) కులాల ముందు గౌడ్ అనే పదాన్ని తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం