News June 4, 2024
రంగంలోకి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్
ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. TDP, జేడీయూలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ ప్లాన్ బీ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబుతో శివకుమార్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్సీపీ(ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా చంద్రబాబు, బిహార్ సీఎంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Similar News
News January 9, 2025
తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘స్విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. వారందరితో మాట్లాడాను. ఘటనపై సమీక్షిస్తున్నా. అసలేం జరిగిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మీడియా ద్వారా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేస్తాను’ అని తెలిపారు. ఘటన విషయంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News January 9, 2025
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
TG: ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
News January 9, 2025
BGT ఓటమికి కారణాలేంటి?.. త్వరలో బీసీసీఐ రివ్యూ మీటింగ్
BGT సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, BCCI అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్‌తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.