News June 4, 2024
నరసాపురం, ఉంగుటూరులో జనసేన విక్టరీ
AP: నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నారాయణ నాయికర్ గెలుపొందారు. తన ప్రత్యర్థి వరప్రసాద్ రాజు(వైసీపీ)పై 49738 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 94116 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి వర ప్రసాద్‌కి 44378 ఓట్లు పడ్డాయి. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Similar News
News January 3, 2025
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ కీలకం?
సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
News January 3, 2025
సైబర్ ట్రక్ వల్లే పేలుడు తీవ్రత తగ్గింది: పోలీసులు
లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ వద్ద జరిగిన పేలుడు తీవ్రత సైబర్‌ట్రక్ కారు వల్ల తగ్గిందని పోలీసులు తెలిపారు. కారు స్ట్రక్చరల్ డిజైన్ వల్ల పేలుడు తీవ్రత పైకి ఎగసిపడడంతో దాని ప్రభావం తగ్గిందన్నారు. హోటల్ ముందు ఉన్న అద్దాలు పగలకపోవడమే దానికి నిదర్శనమన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సర్వేలైన్స్ ఫుటేజీని అందించి ఎలాన్ మస్క్ సాయం చేశారని పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
News January 3, 2025
నిద్ర పోతున్నప్పుడు ఫోన్ ఎక్కడ ఉంచాలంటే?
చాలామంది రాత్రి నిద్రపోయేముందు తమ ఫోన్‌ను దిండు కింద, చేయి దగ్గర ఉంచి నిద్రిస్తారు. కానీ ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రించడానికి 2 లేదా 3 గంటల ముందు ఫోన్‌ను మరో రూమ్‌లో పెట్టి పడకగదిలోకి వెళ్లాలి. మధ్యలో టైమ్, అలారమ్ కోసం కావాలనుకుంటే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఆ సమయంలోనూ కొన్ని అడుగుల దూరంలో పెట్టాలి. పడకమీద ఫోన్ చూడకూడదని మీరే గట్టిగా నిశ్చయించుకోవాలి.