News June 4, 2024

నరసాపురం, ఉంగుటూరులో జనసేన విక్టరీ

image

AP: నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నారాయణ నాయికర్ గెలుపొందారు. తన ప్రత్యర్థి వరప్రసాద్ రాజు(వైసీపీ)పై 49738 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 94116 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి వర ప్రసాద్‌కి 44378 ఓట్లు పడ్డాయి. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Similar News

News November 14, 2024

పిల్లల్ని కోటీశ్వరులను చేసే స్కీమ్.. Children’s day గిఫ్ట్‌గా ఇవ్వండి

image

తల్లిదండ్రులు ఆస్తులు కూడబెట్టేది పిల్లల కోసమే! అందుకే వాళ్ల రిటైర్మెంటు కార్పస్‌నూ పేరెంట్సే క్రియేట్ చేసేందుకు తీసుకొచ్చిన స్కీమే <<14158275>>NPS వాత్సల్య<<>>. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంచేందుకూ ఇది ఉపయోగపడుతుంది. PFRDA వద్ద ఖాతా ఆరంభించి నెలకు కనీసం రూ.1000 జమ చేయాలి. పిల్లలకు 18ఏళ్లు నిండాక రెగ్యులర్ NPSగా మారుతుంది. అప్పట్నుంచి 60 ఏళ్ల వరకు వాళ్లే జమచేయాలి. RoR 12.86% ఉంటే రూ.12 కోట్లు అందుతాయి.

News November 14, 2024

గడచిన 30 ఏళ్లలో రెండింతలైన మధుమేహం!

image

ప్రపంచాన్ని మధుమేహం వేగంగా కబళిస్తోంది. డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య గడచిన 30 ఏళ్లలో రెండింతలైంది. ది లాన్సెట్ జర్నల్ ఈ విషయాన్ని తెలిపింది. దాని ప్రకారం.. 1990లో ప్రపంచవ్యాప్తంగా 7శాతం పెద్దల్లో షుగర్ ఉండగా 2022 నాటికి అది 14శాతానికి పెరిగింది. అంకెల్లో చూస్తే వరల్డ్‌వైడ్‌గా 80 కోట్లమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. భారత్‌లోనూ మధుమేహుల సంఖ్య వేగంగా పెరుగుతోందని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది.

News November 14, 2024

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్

image

AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.