News June 4, 2024
కాంగ్రెస్ నేతల విక్టరీ పోజు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోకు పోజిచ్చారు. కాగా ప్రస్తుతం ఎన్డీఏ 293, ఇండియా కూటమి 232 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు కలిసొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 30, 2024
చైనాలో ‘మహారాజ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ₹15 కోట్లు!
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా నిన్న చైనాలో రిలీజైంది. ఆ దేశవ్యాప్తంగా మొత్తం 40,000+ స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వస్తోందని సినీవర్గాలు తెలిపాయి. తొలిరోజు ఈ మూవీ రూ.15 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో రూ.100కోట్ల మార్క్ దాటిన విషయం తెలిసిందే.
News November 30, 2024
ఎదురుదాడి చేసే హక్కు రష్యాకు ఉంది: కిమ్
లాంగ్ రేంజ్ క్షిపణులను వాడటానికి ఉక్రెయిన్‌కు US అనుమతివ్వడంపై నార్త్ కొరియా నియంత కిమ్ స్పందించారు. ఇది నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావించాల్సి ఉంటుందన్నారు. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుదాడి చేసే హక్కు రష్యాకు ఉంటుందని, శత్రువులు మూల్యం చెల్లించుకునేలా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. తమ దేశంలో పర్యటిస్తున్న రష్యా రక్షణ మంత్రి బెలౌసోవ్‌తో కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొరియా మీడియా వెల్లడించింది.
News November 30, 2024
బంగ్లా హిందువులు సేఫ్ అంటూ అక్కడి మీడియా ఫేక్ సర్వే
బంగ్లాదేశ్‌లో దేవాలయాలు, హిందువులపై దాడులు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ చర్చను తప్పుదారి పట్టించేందుకు అక్కడి మీడియా ప్రయత్నిస్తోంది. యూనస్ ప్రభుత్వంలో మైనార్టీలు సురక్షితంగా ఉన్నట్లుగా చెబుతున్నారంటూ ఓ సర్వేను విడుదల చేశాయి. అయితే 1,000 మందిని సర్వే చేయగా అందులో 92.7 శాతం ముస్లింలే ఉండటం గమనార్హం. హిందువుల రక్షణ గురించి ముస్లింల అభిప్రాయం ఎలా ప్రతిబింబిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.