News June 4, 2024

APలో అత్యధిక మెజారిటీ ఈయనకే..

image

విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సంచలన విజయం నమోదు చేసింది. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై 94,058 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఇక అదే జిల్లాలోని భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ.

Similar News

News November 30, 2024

పదేళ్లలో 102% పెరిగిన మెడికల్ కాలేజీలు: నడ్డా

image

దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.

News November 30, 2024

క్రికెటర్లెందుకు చూయింగ్ గమ్ నములుతారు?

image

క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.

News November 30, 2024

గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే

image

2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల్లో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన రూ.92 కోట్లు చెల్లించారు. ఆయన తర్వాతి స్థానంలో దళపతి విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్(రూ.75 కోట్లు) ఉన్నారు. వారి తర్వాత స్థానాల్లో అమితాబ్(రూ.71 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.66 కోట్లు) నిలిచారు. మహిళా సెలబ్రిటీల్లో కరీనా కపూర్ రూ.20 కోట్లతో టాప్‌లో ఉన్నారు.