News October 7, 2024
ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి షాకవుతారు: శ్రీకాంత్
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా కమర్షియల్ సినిమా అని నటుడు శ్రీకాంత్ అన్నారు. చరణ్‌తో తనకు ముందు నుంచే ర్యాపో ఉందని చెప్పారు. శంకర్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి అభిమానులు షాకవుతారన్నారు. కాగా శ్రీకాంత్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
Similar News
News November 11, 2024
యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యిందంటే?
యాదాద్రిని యాదగిరి గుట్ట అనే ప్రస్తావించాలని CM రేవంత్ ఇటీవల ఆదేశించారు. అయితే యాదగిరి గుట్టను గత CM KCR రూ.వందల కోట్లతో పునర్నిర్మించాక శ్రీవైష్ణవ మఠాధిపతి చిన్నజీయర్ స్వామి సూచనతో యాదాద్రి అని పిలవడం మొదలుపెట్టారు. భద్రాచలం కూడా భద్రాద్రి అని వాడుకలోకి వచ్చింది. అయితే అధికారికంగా యాదాద్రి అనే పేరు మార్పు జరగలేదు. కానీ, రికార్డుల్లో మాత్రం యాదాద్రి అని రాయడం కొనసాగుతూ వచ్చింది.
News November 11, 2024
వైసీపీ ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహణ!
AP: ఇవాళ ఉదయం 10.30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో శాసనసభకు వెళ్లొద్దని నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అవకాశం ఉంది. శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
News November 11, 2024
పత్తి రైతుపై మరో పిడుగు
TG: ఇప్పటికే సరైన ధర లభించడం లేదని దిగులు పడుతున్న పత్తి రైతులపై మరో పిడుగు పడింది. సీసీఐ ధరలతో పాటు తేమ, బరువు విషయంలో విధించిన కఠిన నిబంధనలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని రాష్ట్ర కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల సంక్షేమ సంఘం నిర్ణయించింది. దీంతో అన్ని సీసీఐ కేంద్రాలతో పాటు మార్కెట్లలోనూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.