News June 5, 2024

చంద్రబాబుకు దేవగౌడ అభినందనలు

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయంపై MP, జేడీ(ఎస్) వ్యవస్థాపకుడు దేవ గౌడ TDP చీఫ్ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు నిబద్ధతతో పనిచేస్తారని, అందులో సందేహం లేదన్నారు. ఈ విజయం తనకు 1996లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షణాన్ని గుర్తు చేసిందన్నారు. మరోవైపు కేంద్రంలో NDA గెలుపొందడంపై కూడా ప్రధాని మోదీకి దేవగౌడ అభినందనలు తెలిపారు.

Similar News

News November 29, 2024

నిద్ర రాకముందే బెడ్రూంలోకి వెళ్తున్నారా?

image

చాలామంది నిద్రరాకముందే బెడ్రూంలోకి వెళ్లి బలవంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే ఒత్తిడి పెరిగి నిద్ర రావడం మరింత ఆలస్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే నిద్ర వచ్చే వరకు న్యూస్ పేపర్, బుక్స్ చదవడం చేయాలంటున్నారు. నిద్ర వచ్చినప్పుడే బెడ్రూంలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. త్వరగా నిద్రపట్టేందుకు సా.4 తర్వాత టీ, కాఫీ దూరంపెట్టాలంటున్నారు. డైలీ అరటిపండ్లు తినాలని చెబుతున్నారు.

News November 29, 2024

16 ఏళ్లలోపు పిల్లలకు ఇవి నిషేధం.. చట్టాన్ని ఆమోదించిన ఆస్ట్రేలియా

image

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ తెచ్చిన చ‌ట్టాన్ని ఆస్ట్రేలియా గురువారం ఆమోదించింది. అన్ని టెక్ దిగ్గ‌జాల‌ను దీని ప‌రిధిలోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, మెటా, టిక్‌టాక్‌ వంటి సంస్థలు ఇక నుంచి మైన‌ర్ల లాగిన్‌ను నిలిపివేయాలి. లేదంటే రూ.410 కోట్ల జ‌రిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని జ‌న‌వ‌రిలో పైలెట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసి ఏడాది కాలంలో పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తారు.

News November 29, 2024

పసిపిల్లలకు చలి వేస్తే దుప్పట్లు కప్పొచ్చా?

image

జ్వరాలు వచ్చిన పసిపిల్లలకు దుప్పట్లు కప్పడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మందంగా ఉన్ని దుప్పటి అసలే కప్పవద్దని హెచ్చరిస్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కుతుందని, అప్పుడు దుప్పట్లు కప్పితే లోపల ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందంటున్నారు. చలి ఎక్కువగా ఉన్నట్లయితే పలచటి కాటన్ దుప్పట్లు కాసేపు కప్పవచ్చని, వణకు తగ్గగానే అది కూడా తీసేయాలంటున్నారు.