News June 5, 2024

అసెంబ్లీలో అవమానాన్ని భరించలేకపోయా: చంద్రబాబు

image

AP: అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని చెప్పారు.

Similar News

News November 28, 2024

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు

image

మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున ఇస్తుండగా దానిని రూ.6.19కి పెంచింది. హైస్కూళ్లలో చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.

News November 28, 2024

నేడు వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ఇవాళ రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు TGPSC ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్‌కు సంబంధించి వెరిఫికేషన్ నాంపల్లిలోని కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఒకవేళ ఇవాళ వెరిఫికేషన్‌కు గైర్హాజరైనా, సర్టిఫికెట్లు పెండింగ్ ఉన్నా ఈ నెల 29న రీ-వెరిఫై చేస్తారు.

News November 28, 2024

నేడు ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నేడు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ఆమె నేడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తల్లి సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా సోదరుడు రాహుల్ లోక్‌సభ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వయనాడ్ ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రియాంక చరిత్ర సృష్టించారు.