News June 5, 2024
అసెంబ్లీలో అవమానాన్ని భరించలేకపోయా: చంద్రబాబు
AP: అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని చెప్పారు.
Similar News
News December 12, 2024
ప్రమాణ స్వీకారానికి రండి: జిన్‌పింగ్‌కు ట్రంప్ ఆహ్వానం!
అమెరికా ప్రెసిడెంట్‌గా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. చైనా పేరెత్తితేనే భగ్గుమనే ఆయన JAN 20న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆ దేశ ప్రెసిడెంట్ షి జిన్‌పింగ్‌ను ఆహ్వానించారని తెలిసింది. NOVలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆహ్వానం పంపారని సమాచారం. రావడానికి జిన్‌పింగ్ అంగీకరించారో లేదో స్పష్టత రాలేదు. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయమూ వివరణ ఇవ్వడం లేదు.
News December 12, 2024
త్వరలో RTC బస్సుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు
TG: రాష్ట్రంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య త్వరలోనే ‘చిల్లర’ సమస్యలు తీరనున్నాయి. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ల కోసం RTC ఏర్పాట్లు సిద్ధం చేయగా, తొలుత HYDలో పరిశీలించనుంది. ఆపై రాష్ట్రమంతటా వినియోగంలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే సంస్థ చేతికి 6 వేల ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లు అందాయి. ప్రస్తుతం దూరప్రాంత రూట్లలోనే ఉండగా, త్వరలో ఇవి పల్లెవెలుగు వంటి గ్రామీణ ప్రాంత బస్సుల్లోనూ ఉపయోగించనున్నారు.
News December 12, 2024
రాహుల్.. ఫోన్ బ్యాంకింగ్ బాగోతం గుర్తులేదా: నిర్మలా సీతారామన్
ప్రభుత్వ బ్యాంకులను కాంగ్రెస్ ATMsగా ట్రీట్ చేసిందని FM నిర్మల అన్నారు. ‘ఫోన్ బ్యాంకింగ్’తో ఉద్యోగులను ఒత్తిడిచేసి తమ క్రోనీస్‌కు లోన్లు మంజూరు చేయించిందన్నారు. ‘2015లో మేం చేపట్టిన సమీక్షలో ఫోన్ బ్యాంకింగ్ బాగోతం బయటపడింది. NPAలతో గడ్డకట్టుకుపోయిన బ్యాంకింగ్ వ్యవస్థను నిధులిచ్చి మోదీ ప్రభుత్వమే కాపాడింద’న్నారు. సంపన్నులకు PSBలు ప్రైవేటు ఫైనాన్షియర్లుగా మారాయన్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.