News June 5, 2024

మీసం మెలేసిన అచ్చెన్నాయుడు

image

AP: శ్రీకాకుళంలో ఎన్నికల ఫలితాలు NDA కూటమిలో జోష్ నింపింది. ఉమ్మడి సిక్కోలులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, ఒక MP స్థానంలోనూ కూటమి అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. గత ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైన TDP ఈసారి కూటమిగా క్లీన్ స్వీప్ చేసింది. ఫలితాలతో TDP, BJP,జనసేన శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీసం మెలేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Similar News

News November 28, 2024

HYDలో తగ్గిన యాపిల్ ధరలు

image

గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో యాపిల్ ధరలు తగ్గాయి. 2023 డిసెంబర్‌లో మంచి నాణ్యత గల యాపిల్స్ ఒక్కోటి ₹35-₹40, సాధారణ రకం పండ్లు ఒక్కోటి ₹25కు లభించాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి హై క్వాలిటీ యాపిల్స్ ఒక్కోటి ₹18, రెగ్యులర్ క్వాలిటీ పండ్లు ఒక్కోటి ₹10కే దొరుకుతున్నాయి. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పంటలు బాగా పెరగడం, HYD పండ్ల మార్కెట్‌లకు సరఫరా పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News November 28, 2024

వీలైనంత త్వరగా పింఛన్ల పెంపు: మంత్రి

image

TG: దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

News November 28, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్!

image

యూజర్ల సౌలభ్యం కోసం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహాలో IGలోనూ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్‌లోకి వెళ్లిన తర్వాత మెనూబార్‌లో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కరెంట్ లొకేషన్‌తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం చేసినట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలో మిగిలిన దేశాలకూ విస్తరించనుంది.