News June 5, 2024

మీసం మెలేసిన అచ్చెన్నాయుడు

image

AP: శ్రీకాకుళంలో ఎన్నికల ఫలితాలు NDA కూటమిలో జోష్ నింపింది. ఉమ్మడి సిక్కోలులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, ఒక MP స్థానంలోనూ కూటమి అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. గత ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైన TDP ఈసారి కూటమిగా క్లీన్ స్వీప్ చేసింది. ఫలితాలతో TDP, BJP,జనసేన శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీసం మెలేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Similar News

News February 15, 2025

బాంబూ సాల్ట్.. కిలో రూ.30,000

image

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.

News February 15, 2025

సిన్నర్‌పై డోపింగ్ ఆరోపణలు.. మూడు నెలలు నిషేధం

image

మెన్స్ టెన్నిస్ నం.1 ప్లేయర్ జన్నిక్ సిన్నర్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్‌లో పట్టుబడ్డ అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. ఫిజియోథెరపీ సమయంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్లిందని సిన్నర్ ఆంగీకరించారు. WADA కూడా సిన్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి మోసం చేయలేదని పేర్కొంది. అయినా FEB 9- మే 4 వరకు నిషేధం అమల్లో ఉంటుందంది. కాగా ఇటీవల సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు.

News February 15, 2025

భారత్‌లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.

error: Content is protected !!