News June 5, 2024
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కసరత్తు
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన బీజేపీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆ పార్టీ సీఎం అభ్యర్థిపై స్పష్టత రానుంది. సీఎం రేసులో జుయల్ ఓరం, ధర్మేంద్ర ప్రదాన్, సంబిత్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో BJP 78, BJD 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలిచారు. 21 లోక్‌సభ స్థానాలకు BJP 20, కాంగ్రెస్ ఒకచోట గెలిచాయి.
Similar News
News November 28, 2024
ఈడీ అధికారులపై దాడి
సైబర్ నేరాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసుపై ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ బృందంపై దుండగులు కుర్చీలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులు అశోక్ శర్మ, అతని సోదరుడిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఫిషింగ్, క్యూఆర్ కోడ్, పార్ట్ టైమ్ జాబ్స్ వంటి వేలాది స్కామ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధుల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది.
News November 28, 2024
నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన 6గంటల్లో 2కి.మీ. వేగంతో నెమ్మదిగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 110కి.మీ, నాగపట్నానికి 310కి.మీ, పుదుచ్చేరికి 410కి.మీ, చెన్నైకి 480కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. రానున్న 12 గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, రేపు ఉదయం లోపు తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
News November 28, 2024
వచ్చే ఏడాది అఖిల్-జైనబ్ వివాహం: నాగార్జున
అక్కినేని చైతన్య-శోభితతోపాటు అఖిల్-జైనబ్ వివాహం డిసెంబర్ 4నే జరుగుతుందనే ప్రచారాన్ని నాగార్జున ఖండించారు. చిన్న కొడుకు పెళ్లి వచ్చే ఏడాది చేస్తామని తెలిపారు. ‘అఖిల్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అతనికి కాబోయే భార్య జైనబ్ మంచి అమ్మాయి. వారిద్దరూ జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకోవడం మంచి విషయం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అఖిల్-జైనబ్ ఎంగేజ్‌మెంట్ ఈ నెల 26న జరిగిన విషయం తెలిసిందే.