News November 28, 2024
ఈడీ అధికారులపై దాడి
సైబర్ నేరాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసుపై ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ బృందంపై దుండగులు కుర్చీలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులు అశోక్ శర్మ, అతని సోదరుడిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఫిషింగ్, క్యూఆర్ కోడ్, పార్ట్ టైమ్ జాబ్స్ వంటి వేలాది స్కామ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధుల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది.
Similar News
News December 6, 2024
రోదసిలో నడవనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్‌లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.
News December 6, 2024
పుష్ప-2 డైలాగ్స్.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. వాళ్లు స్వయంకృషితో ఎదిగారు తప్ప కుటుంబం పేరు వాడుకోలేదన్నారు. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు. సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు.
News December 6, 2024
అంబేడ్కర్ కీర్తిని చాటేందుకు కృషి చేశాం: KCR
TG: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా BRS అధినేత KCR ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘సమసమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్. వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడారు. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేశాం. అణగారిన వర్గాలకు సమన్యాయం దక్కేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపింది’ అని KCR గుర్తుచేసుకున్నారు.